Shatamanam Bhavati :Mellaga Tellarindoi Song Lyrics (మెల్లగా తెల్లారిందో ఎలా )
చిత్రం: శతమానంభవతి(2017)
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
సంగీతం: మిక్కీ జె మేయర్
పల్లవి:
మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలాబోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లాచేదతో బావులలో గలా గలాచెరువులో బాతుల ఈతల కలచేదుగా ఉన్నా వేపను నమిలే వేళచుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లోబాటలే కలిపేస్తూ మనసారామమతల్ని పండించు అందించు హృదయంలాచలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలాసుప్రభాతాలే వినవేలాగువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళాస్వాగతాలవిగో కనవేలా
చరణం:1
పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచికళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడిచివొదట అందరి దేవుడి గంటమొదటి బహుమతి పొందిన పాటతాయిలాలకు తహ తహ లాడిన పసి తనమే గుర్తొస్తుందాఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలేదాచగల రుజువులు ఎన్నో ఈ నిలయానానువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలానువ్వెదిగిన ఎత్తే కనపడకనువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలానన్నెవరు వెతికే వీల్లేక
చరణం:2కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలేసవ్వడితో సంగీతం పలికించే సెలయెళ్లేపూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాషఅర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్టాడే భాషపలకరింపే పులకరింపై పిలుపునిస్తేపరవశించడమే మనసుకి తెలిసిన భాషమమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరుపల్లెటూరేగా ఇంకెవరుప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరుకాదనేవారే లేరెవరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి