19, జూన్ 2021, శనివారం

Aame : Oohala Pallakilo Ooregutunnadi (ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు)

 చిత్రం: ఆమె (1994)

సంగీతం: విద్యాసాగర్

గానం: బాలు, చిత్ర



ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు చిరుచిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు కాటుకా..అది నీలి మేఘ చారికా తిలకమా..గురిపెట్టిన మన్మధ బాణమా ||ఊహల పల్లకిలో|| *ఉదయ సంధ్య వేళలో చిలిపి చల్లగాలిలో అరుణ కిరణ ధారనై ఒడిని చేరనా వెండిమబ్బు నీడలో వెన్నెలమ్మ మేడలో కన్నె జాజిపువ్వునై కౌగిలించనా !! పరువాల పూసిరిలోన నెరజాణ తమకాల తెరతీయ్నా అధరాల కలయికలోన మృదువీణ గమకాలు జతచేయ్నా !! తనువు నీది తలపు నాది ధిరన ధిరన ధిరన ధిరననా ||ఊహల పల్లకిలో|| *నిలువనీయనన్నది నిదుర మానుకున్నది నిన్ను చేరమన్నది కన్నె ప్రాయము వేళకాని వేళలో..దారికాని దారిలో వయసు వేణువైనది ఎంత చిత్రము !! సరసాల సరిగమలోన చెలికాడా శృతులేవో సరిచేయ్నా మదనాల మధురిమలోన మురిపాల శిఖరాలు చూపేయ్నా !! తనువు నాది తలపు నీది ధిరన ధిరన ధిరన ధిరననా ||ఊహల పల్లకిలో||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి