చిత్రం : తాజ్ మహల్(1995)
సంగీతం: M.M.శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
పల్లవి: మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొత్తదాహంలో వింతమోహంలో మదిలో సంబరం పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 1: ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి తోడై నువ్వుంటే నీడై నేనుంటా లోకం నువ్వంటా ఏకంకమ్మంటా వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని తరగని ప్రేమలలో పల్లవించుతున్న ప్రణయమా మళ్లీ మళ్లీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపో కొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం చరణం 2: వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి చిందే సింగారం సిగ్గే సింధూరం పొందే వైభోగం నాదే ఈ భాగ్యం కలయికల కావ్యమై కలలు చిగురించెనా శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా ఏడేడు లోకాల ఎల్లలుదాటిన అల్లరి ప్రేమల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి