చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, సుజాత
పల్లవి
వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో ||సామిరంగా||
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో ||సామిరంగా||
ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే ||వాన వల్లప్పా||
చరణం 1
ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
తారా రారా రారా
వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో ||సామిరంగా||
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో ||సామిరంగా||
చరణం 2
వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
అమ్మదొంగ సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా
తూరు రురు తూరు రురు తూరు రురు
వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో ||సామిరంగా||
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో ||సామిరంగా||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి