24, జులై 2021, శనివారం

Bullettu Bandi Folk Song : Bullettu Bandi (నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా..)

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... (2022)

రచన:

గానం:

సంగీతం:



పల్లవి: 

నే పట్టుచీరనే గట్టుకున్నా.., గట్టుకున్నుల్లో గట్టుకున్నా..., టిక్కీబొట్టే వెట్టుకున్నా..., వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా...., నడుముకి వడ్డాణం జుట్టుకున్నా.., జుట్టుకునుల్లో జుట్టుకున్నా...., దిష్టి సుక్కనే దిద్దుకున్నా..., దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా..., పెళ్ళికూతురు ముస్తాబురో.. నువ్వు యేడంగా వస్తావురో... చెయ్యి నీ చేతికిస్తానురో... అడుగు నీ అడుగులేస్తానురో.. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా.. ఇట్టే వస్తారా నీ వెంటా... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...

చరణం:1

చెరువు కట్టపొంటి చేమంతివనం... బంతివనం, చేమంతివనం... చేమంతులు దెంపి దండ అల్లుకున్నా... అల్లుకున్నుల్లో ఆల్లుకున్నా... మా ఊరు వాగంచున మల్లేవనం... మల్లేవనములో మల్లేవనం... మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా... నింపుకున్నుల్లో నింపుకున్నా... నువ్వు నన్నేలుకున్నావురో... దండ మెళ్లోన యేస్తానురో... నేను నీ ఏలువట్టుకోని...మల్లె జల్లోన ఎడతనురో.. మంచి మర్యాదలు తెలిసినదాన్ని... మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని.... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...

చరణం:2

నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో... పిల్లనయ్యో,ఆడపిల్లనయ్యో.... మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో.. ప్రేమనయ్యో,నేను ప్రేమనయ్యో... ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో.. దాన్నిరయ్యో,ఒక్కదాన్నిరయ్యో... మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో... ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో.. పండు ఎన్నల్లో ఎత్తుకొని, ఎన్న ముద్దలు వెట్టుకొని, ఎన్ని మారాలు జేస్తు ఉన్నా, నన్ను గారాలు జేసుకొని, చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను... నీ చేతికిస్తరా నన్నేరా నేను... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా... వెట్టినంకుల్లో.., వెట్టినంకా... సిరిసంపద సంబురం గల్గునింకా.... గల్గునింకుల్లో.., గల్గునింకా.... నిన్ను గన్నోల్లే కన్నోల్లు అనుకుంటా..., అనుకుంటుల్లో అనుకుంటా.., నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా..., పంచుకుంటుల్లో పంచుకుంటా...., సుక్క పొద్దుకే నిద్రలేసి, సుక్కలా ముగ్గులాకిట్లేసి.., సుక్కలే నిన్ను నన్ను చూసి, మురిసిపోయేలా నీతో కలిసి.., నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా, నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా.... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి