చిత్రం:కలిసుందాం రా(2000)
సంగీతం: S.A.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా
హే నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా
నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా
నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా...హే
వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా
నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా
మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా
హే నచ్చావే పాల పిట్టా
తెచ్చింది పూల బుట్టా
చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఎందమ్మో ఎడ్డెం అంటే టెడ్డెం అంటావు హే
కాలేస్తే చెయ్యంటావు పండిస్తే పో అంటావు
ఎందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
ఒంపుల తొణలు వలుచుకుంటా
ఒంటిని తడితే జడుచుకుంటా
ఔనంటే బాదంపిస్తా కొనితెస్తానే బాల
అందాలే రేపటికిస్తా పై పై కొస్తావేలా
అందాకా చూస్తూ ఉండాలా హేయ్...
వచ్చింది పాల పిట్టా
రెచ్చావే కోడిపెట్టా
కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు
హో కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు
పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు హొయ్
సోకంతా చిదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెయ్యకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటా
జల్లెడ పడితే వల్లనంటా
నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ
నీ లోని చొరవే చూసి అయ్యనయ్యో దాసి
పట్టేగా నిన్నే ఎరవేసి హేయ్
నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా
నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా
మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా
హా హా హోయ్ నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా హోయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి