24, జులై 2021, శనివారం

Ontari : Cheppalanundhi Chinna Mataina Song Lyrics (చెప్పాలనుంది చిన్నమాటైనా)

 

చిత్రం : ఒంటరి (2008) సంగీతం : మణిశర్మ రచన : రామజోగయ్య శాస్త్రి గానం : SPB.చరణ్, కల్పన


చెప్పాలనుంది చిన్నమాటైనా.. ఆగనంది దాగనంది లోలోనా... ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా.. ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా ! పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో పరదా తొలగించు కొంతైనా ! సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో నీకోసం వేచి చూస్తున్నా ! చెప్పాలనుంది చిన్నమాటైనా.. ఆగనంది దాగనంది లోలోనా ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా.. ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా ! గుండెలయలో..ఓ ఓ ధీంతధిరనా ఎన్ని కధలో..ప్రేమవలనా హాయి అలలో..ఓ ఓ ఊయలవనా రేయినదిలో.. జాబిలవనా నీ ప్రేమలోనే మేలుకుంటున్నా మేఘాలపైనే తేలిపోతున్నా నాకు తెలియని నన్ను కనుగొని నవ్వుకుంటున్నా ! చెప్పాలనుంది చిన్నమాటైనా.. ఆగనంది దాగనంది లోలోనా వెంటనడిచే.. ఓ ఓ నీడననుకో జంటనడిపే .. జాడననుకో పూలు పరిచే .. ఓ ఓ దారిననుకో నిన్ను కలిసే .. బంధమనుకో నా ప్రేమలోకం నువ్వే అంటున్నా నీతో ప్రయాణం ఇష్థమేనన్నా ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా ! చెప్పాలనుంది చిన్నమాటైనా.. ఆగనంది దాగనంది లోలోనా ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా.. ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా ! పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో పరదా తొలగించు కొంతైనా ! సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో నీకోసం వేచి చూస్తున్నా ! చెప్పాలనుంది చిన్నమాటైనా.. ఆగనంది దాగనంది లోలోనా ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా.. ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి