చిత్రం: ప్రేమలేఖ(1996)
సంగీతం : దేవా
సాహిత్యం: భువన చంద్ర
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,అనురాధ శ్రీరామ్
ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక నీ తలుపుతోనే నే బ్రతుకుతున్నా . . . నీ తలపుతోనే నే బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక...
వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం అనుక్షణం నామనసు తహతహలాడే ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే అనుదినం కలలలో నీకధలే కనులకు నిదురలే కరువాయె
ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపు రాక
కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని లేఖతో ముద్దయినా అందించరాదా నినుగాక నీ కలనీ పెదవంటుకోదా వలపులు నీదరి చేరుటెలా ఊహల పడవలే చేర్చునులే
ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక హాఅ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . . నీ తలపుతోనే నే బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక... మీ స్నేహ గీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి