చిత్రం :సింధూరం (1997)
సంగీతం : శ్రీ కొమ్మినేని
సాహిత్యం : చంద్రబోస్
గానం: శ్రీనివాస్
హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! కళ్ళముందు కదులుతోందిరా ముద్దుగా ఏం రూపురా... ఏం రంగురా ఏం రూపురా... ఏం రంగురా సొంతమైతే అంతకన్ననా.. అయ్యబాబోయ్ హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! చూడగానే నోరు ఊరెరోయ్ తియ్యగా సొంతమైతే అంతకన్ననా.. అయ్యబాబోయ్ *అందమైన కోనసీమ కొబ్బరాకులా తెల్లవారి వెలుగులోన తులసిమొక్కలా పెరటిలోన పెంచుకున్న ముద్దబంతిలా పెరుగులోన నంజుకున్న ఆవకాయలా బుట్టబొమ్మలా పాలపిట్టలా గట్టుదాటు గోదారిలా తేనెచుక్కలా వాన చినుకులా మమ్మగారి ముక్కుపుడకలా ఉంది పిల్ల !! హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! *పాత తెలుగు సినీమాలో సావిత్రిలా ఆలయాన వెలుగుతున్న చిన్నిదివ్వెలా తామరాకు ఒంటిపైన నీటిబొట్టులా వాకిలంత నిండివున్న రంగుముగ్గులా చేపపిల్లలా.. చందమామలా ముద్దు ముద్దు మల్లెమొగ్గలా చెరుకుపంటలా.. భోగిమంటలా పసుపురంగు ఇంటి గడపలా ఉంది పిల్ల !! హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! కళ్ళముందు కదులుతోందిరా ముద్దుగా ఏం రూపురా... ఏం రంగురా ఏం రూపురా... ఏం రంగురా సొంతమైతే అంతకన్ననా.. అయ్యబాబోయ్ హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !! హాయ్ రే హాయ్...జాంపండురోయ్ !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి