11, జులై 2021, ఆదివారం

Sisindri : Aataadukundam Raa Song Lyrics (ఆటాడుకుందాం రా)

చిత్రం: సిసింద్రీ(1995)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: రాజ్

గానం: స్వర్ణలత

పల్లవి :

ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!

అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!

సై సై అంటా (హోయ్ హోయ్)

చూసేయ్ అంటా (హోయ్ హోయ్)

నీ సొమ్మంతా (హోయ్ హోయ్)

నాదేనంట (హోయ్ హోయ్)

ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!

అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!

చరణం:1

ఓరి గండుతుమ్మెదా.. చేరమంది పూపొదా

ఓసి కన్నెసంపదా.. దారిచూపుతా పదా !

మాయదారి మన్మథా.. మరీ అంత నెమ్మదా 

అంత తీపి ఆపదా.. పంటనొప్పి ఆపదా

వయస్సుంది వేడిమీద.. భరిస్తుంది చూడరాదా

తీసివుంచు నీయెద.. వీలుచూసి వాలెద..

ఓ రాధ.. నీ బాధ.. ఓదార్చి వెళ్ళేదా !!

ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!

అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!

చరణం:2

ముద్దుముద్దుగున్నది.. ముచ్చటైన చిన్నది

జోరుజోరుగున్నది... కుర్రవాడి సంగతి !

నిప్పు మేలుకున్నది.. తప్పు చెయ్యమన్నది

రెప్ప వాలకున్నది.. చూపు చుర్రుమన్నది

మరీ లేతగుంది బాడీ..భరిస్తుందా నా కబాడీ

ఇష్టమైన ఒత్తిడి.. ఇంపుగానే ఉంటది..

ఇందాక వచ్చాక సందేహమేముంది !!

ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా !!

అల్లేసుకుందాం రా మల్లెతీగా ఒప్పుకో సరదాగా !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి