చిత్రం: వెంకీ(2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్, సుమంగళి
హొయ్ అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాల చీకటినీ తిడుతూనే ఉంటామ
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమ
ఆ వెలుగులికి తొలి చిరునామ అదె ఒకటే చిరునవ్వే నమ్మ...
అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
హొయ్ బాదలో కన్నులో కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా అరె ఈనేల ఆకాశం ఉందే మన కోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేల అల్లరిచేద్దాం...
అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
ఎందుకో ఏమిటో ఎంతమందిలో వున్నా
నా ఎద నీజతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా
హేయ్... కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి
కలిపేస్తూ నీ చేయి అడుగే చిందెయ్యి
మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి