చిత్రం: వెంకీ(2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: శ్రీరాం పార్థసారథి, మాలతి లక్ష్మణ్
హేయ్...సిలకేమో సీకాకులం....
అరె కులుకేమో మల్కీపురం
హేయ్...సిలకేమో సీకాకులం...
కులుకేమో మల్కీపురం
సొగసేమో ఈశాపట్నం జగదాంబ జంక్షన్రో
అరె.... పెదవేమో పిఠాపురం
రుచి చూస్తే మిఠాయ్ పురం
నడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే
కిర్లంపుడి సరుకేరో....
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్
హేయ్...సిలకేమో సీకాకులం...
అరె కులుకేమో మల్కీపురం....
అరె....యే యే యె..
వన్నె చుస్తే పాలగడి ఒళ్ళు చూస్తె పూలంగడి
బుగ్గ చూస్తే బోగాపురం బూరెల కావడి ...
దీని
జెబ్బచూస్తె పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి
అరె...యే యే యె.
పూసపాటి పుంజుకోడి రోసమొస్తె అబ్బాడీ
ముందుఎనక నోట్లోవున్న ముప్పైపళ్ళూడి అబ్బో
అపోజిసనైపోతాది అప్పుడె పిండి పిండి
ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళీ బండీ
పూల బండెక్కి వచ్చి
పాలవెండి చుక్కల్లోపక్కేసి లాగిస్త నాబండి
మాస్ తోపెట్టు కుంటే మడతడి పోద్ది
అది
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్...
హేయ్...సిలకేమో సీకాకులం....
అరె కులుకేమో మల్కీపురం
అరె ...యే యే యె.
ఉన్నోళ్ళూ లేనోళ్ళూని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు..
వాటి ఆటలింక కట్టించకుంటే బతకరు పేదోళ్ళు
అరె...హా...యాయ్....యాయ్...
ముందు మరి ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు
లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు
ఇట్టా వీధికెక్కి పెట్టక తప్పదు
వీపులు దంపుళ్ళు
నువ్వు సేనానివయ్యో
సిహ్మాచాలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యా....
ఎదుటి వాడి మేలుని కోరే మనిషిని నువ్వేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది .ఏయ్..
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది
అరె ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది..ఏయ్.
హేయ్...సిలకేమో సీకాకులం....
అరె కులుకేమో మల్కీపురం
హేయ్...సిలకేమో సీకాకులం...
కులుకేమో మల్కీపురం
సొగసేమో ఈశాపట్నం జగదాంబ జంక్షన్రో
అరె.... పెదవేమో పిఠాపురం
రుచి చూస్తే మిఠాయ్ పురం
నడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే
కిర్లంపుడి సరుకేరో....
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి