9, ఆగస్టు 2021, సోమవారం

20 va Shatabdam : Ammanu Minche Daivam Song Lyrics (అమ్మను మించి దైవమున్నదా)


చిత్రం:- 20వ శతాబ్దం (1983)

సాహిత్యం:- సి.నారాయణరెడ్డి

గానం:- యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం:- జె. వి. రాఘవులు



పల్లవి : అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అద్దమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అద్దమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా  ఓ అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా  ఓ అమ్మకు కొడుకే ॥ చరణం : 1 రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి సుగుణ రాశి సీతలాగ తాను కోటి ఉగాదులేనా గడపకు తేవాలి మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈ లోగిలి కోవెలగా మారాలి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అద్దమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా  ఓ అమ్మకు కొడుకే చరణం : 2 తప్పడడుగులేసిన చిననాడు అయ్యో తండ్రీ అని  గుండె కద్దుకున్నావు తప్పడడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నింగికి నిచ్చెనలేసే మొనగాడినే నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట  అదే అదే పసివాడినే


అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అద్దమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అద్దమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా  ఓ అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా  ఓ అమ్మకు కొడుకే ॥



















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి