14, ఆగస్టు 2021, శనివారం

Alludu Garu : Konda Meedha Song Lyrics (కొండమీద సుక్కపోటు)

చిత్రం. : అల్లుడు గారు (1990)

సంగీతం : కె వి మహదేవన్ గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
రచన : జాలాది



కొండమీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు చెప్పుకుంటే సిగ్గుచేటు ఆడ్ని తలుసుకుంటే సులుకుపోటు గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమందిరో సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమందిరో సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో కొండమీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు పిల్లకేమో సులుకుపోటు దాని ఒళ్ళుజూస్తే తుళ్ళిపాటు గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా ఆరుబైటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేనా... ఓ ఓహో ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేనా... అహహాహ ఆరుబైటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేనా ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేనా నిదరెట్టా పట్టేది రొదనెట్టా ఆపేది మనసెట్టా ఆగేది నా మరులెట్టా తీరేది ఓలమ్మో ముద్దులగుమ్మా వయ్యారి ఎన్నెలకొమ్మా నడిరాతిరి దుప్పట్లో నడిగుండెల చప్పట్లో నడిరాతిరి దుప్పట్లో నడిగుండెల చప్పట్లో నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేనా నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేనా ఇద్దరి నడుమ నిద్దర లేని ముద్దుల మద్దెల పాడించేనా కొండమీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు పిల్లకేమో సులుకుపోటు దాని ఒళ్ళుజూస్తే తుళ్ళిపాటు గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమందిరో సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా వగలాడే మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యాల వెయ్యాల పగలూరేయనకుండా పందిరి మంచం నవ్వాల వగలాడే మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యాల వెయ్యాల పగలూరేయనకుండా పందిరి మంచం నవ్వాల నెలవంకను తెచ్చేనా నడుమొంపున చుట్టేనా ఒడిలోనే పడవల్లే సుడిలేసుకు తిరిగేనా ఓరయ్యో అందగాడా సిందులాడే సెందురూడా సుడులాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో సుడులాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో వన్నెల చిన్నెల ఒంపులు సొంపుల ఆడించేనా వన్నెల చిన్నెల ఒంపులు సొంపుల ఆడించేనా నా సిగ్గుల మొగ్గల బుగ్గల మీద ఎర్రని పూలే పూయించేనా కొండమీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు చెప్పుకుంటే సిగ్గుచేటు ఆడ్ని తలుసుకుంటే సులుకుపోటు గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమంటుందా సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమంటుందా గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కుమందిరో సిగ్గు సితుక్కు సితుక్కు సితుక్కుమందిరో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి