12, ఆగస్టు 2021, గురువారం

Bharya Biddalu : Chakkanayya Chandamama Song Lyrics (చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ)

చిత్రం :భార్య బిడ్డలు (1972)

సంగీతం: కె. వి. మహదేవన్

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల


చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ గొల్లుమన్నాము చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ వెతుకుతున్నామూ చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో రాలేకవున్నావో చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి