14, ఆగస్టు 2021, శనివారం

Janaki Weds Sri Ram : Pandu Vennallo Song Lyrics (పండు వెన్నెల్లో ఈ వేణు గానం)

చిత్రం: జానకి వెడ్స్ శ్రీ రామ్ (2003)

సంగీతం:ఘంటాడి కృష్ణ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి




పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం యద నీ రాక కోసం పలికే స్వాగతం

ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక ఇటు ఇటు అంటూ నిను  నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక  

పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం


కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి కరిగేలా విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల ప్రాయం పొంగే పాల కడలి అలలాగా                                                                        


పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి