చిత్రం: కోడెత్రాచు(1984)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
గంగమ్మ ఉరవడిలో యమునమ్మ పరవడిలో కలిపేస్తా వలపంతా కౌగిళ్ళలో కవ్వించే కాముడిలా కనిపించే దేవుడిని అడిగేస్తా వరమేదో సందిళ్ళలో అలలైన ఆశలతో బ్రతుకైన బాసలతో తీరాలు కలిసాయి ఎన్నాళ్ళకో గంగమ్మ ఉరవడిలో యమునమ్మ పరవడిలో చలిగాలి చెలరేగుతుంటే చెలి జంటలో కాగుతుంటే కసిమీద ఉన్నాడు పసివాడు నావాడు కౌగిళ్ళతో ఊరుకోడు మనసంతా వయసొచ్చి మసకేసుకొస్తుంటే కవ్వింతలే ఆపలేను వేళాపాలా లేదా పాపం ఈ వెర్రికి రాసలీల సాగే నేడే ఈ జన్మకి !!
గంగమ్మ ఉరవడిలో యమునమ్మ పరవడిలో ఒక కన్ను నిను గిల్లుతుంటే తొలిసారి మది ఝల్లుమంటే సిగ్గొచ్చి సూరీడు దిగజారిపోయాడు పొదరిళ్ళ వాకిళ్ళు తీసి పదునైన బాణాలు వదిలాడు నావాడు ఆ కళ్ళతో ఆకలేసి పున్నమొచ్చె నేడే నడిచే జాబిల్లికి వెన్నెలంతా నీదే కాదా ఈ జన్మకి !
గంగమ్మ ఉరవడిలో యమునమ్మ పరవడిలో కలిపేస్తా వలపంతా కౌగిళ్ళలో కవ్వించే కాముడిలా కనిపించే దేవుడిని అడిగేస్తా వరమేదో సందిళ్ళలో అలలైన ఆశలతో బ్రతుకైన బాసలతో తీరాలు కలిసాయి ఎన్నాళ్ళకో గంగమ్మ ఉరవడిలో యమునమ్మ పరవడిలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి