చిత్రం: నా అల్లుడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం:జస్సియ గిఫ్ట్, కల్పనా
హే కందిచేను కాడ... హొయ్ కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి హే మల్లి తోట కాడ మనసు కలుపుతాలే ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి హే పరువాల పాలపిట్టవే నా తస్సదియ్య మస్సాల కోడిపెట్టవే హే నందమూరి అందగాడివే నా సామి రంగ సరసాల సందురూడివే చక్కాని చుక్కవే మందార మొగ్గవే అందాలు దక్కనీవే సందెకాడ వస్తనంది మర్చిపోకు వచ్చి ఇస్తనన్న ముద్దులియక వెళ్ళిపోకు హోయ్ మల్లి పూల మత్తుజల్లి అల్లుకోకు నన్ను మళ్ళి మళ్ళి ముగ్గులోకి దించమాకు హే కందిచేను కాడ... హొయ్ కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి హేయ్ పళ్ళ బుట్టలా అరె తేనె బుట్టలా హొయ్ పూల తట్టలా ఉంది పిల్ల చూడరా హే చేప తొట్టెలా అరె వేపగుట్టలా హేయ్ టేకు చెక్కలా ఏంటి పిల్లగాడురా హొయ్ రావే నీ దిమ్మ దియ్య రేయే తెల్లారదియ్య దుమ్మే దుమ్మెత్తి పోయే వంత పాటలా రారో నా తొందరయ్య నీతోని చిందులెయ్య నువ్వే నా కొంగు పట్టి బంతులాడరో అత్తమ్మ కూతురా రత్తమ్మ జాతరో సొత్తంతా బండికెత్తరో ఆరబెట్టి ఊరబెట్టి ఉంచినాన్లే నీకు ఇష్టమైతే పీత పులుసు పంచుతాలే హే కోక గుట్టు కొమ్మ చాటు దించుతాలే నీకు ఆకలైతే తేనె బొట్టు వంచుతాలే మల్లి తోట కాడ... మల్లి తోట కాడ మనసు కలుపుతాలే ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి లేత పైటరో అరె లేవగొట్టరో హొయ్ బుగ్గ పోటురో పంటి గాటు పెట్టరో హొయ్ వేడి రొట్టెరో పైన వెన్నబెట్టరో హొయ్ చెయ్య పట్టరో నెయ్యి కరగబెట్టరో ఇస్ ఆ పెట్టె కాలేటి వేళ ఇట్టా నా కాలిలోన ముల్లెదో గుచ్చుకుంది తీసి పెట్టవో ఇల్లా నా సూది గుచ్చి అల్లా నే ముళ్ళు తీస్తా పిల్లా నీ కాలు కాస్త కడగబెట్టవో అబ్బబ్బ నొప్పిరో అమ్మమ్మ నొప్పిరో ముద్దిస్తే నొప్పి తగ్గురో మొత్తుకుంటు లొల్లి లొల్లి పెట్టమాకు నిన్ను ఎత్తుకుంట ఇంటికెళ్ళి సెప్పమాకు హే ఇంక నాకు వేసుకోర మందు మాకు చీర అంచు దాటి ఎక్కుతోంది మంట నాకు హే కందిచేను కాడ... హొయ్ కందిచేను కాడ కన్ను వేసినానే వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి మల్లి తోట కాడ మనసు కలుపుతాలే ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి