22, ఆగస్టు 2021, ఆదివారం

Sriranganeetulu : Panchami Poota Manchidhani Song Lyrics ( పంచమి పూట మంచిదని )

చిత్రం: శ్రీరంగనీతులు

సంగీతం: చక్రవర్తి 

రచన: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు వచ్చేవారం ముచ్చటని రాసిచ్చాను ఎదచాటు ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో....... అయ్యో పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు ఊపిరి నీవే అన్నానని మనసిచ్చాను గ్రహపాటు ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...... పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు కళ్ళల్లోకి చూస్తే..సంకెళ్ళువేసేస్తావు నీ పైట చాటూకు వస్తే..చాపల్లే చుట్టేస్తావు కలలోకి రావద్దన్న..వస్తావు రేయంతా నీ ప్రేమ ముద్దరలన్ని..పూస్తావు వొళ్ళంతా సరదాలే ఈవేళ..సరిగమలే..పాడాయి ఆ మాటే అన్నావు చాలింకా..నీ మోజే మళ్ళింది నావంకా అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...... పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు ఎదురుగ వున్నగాని..ఎదలోకి రమ్మన్నానా ఎగతాళికన్నాగాని..నను దోచుకోమన్నానా వగలన్ని చూస్తువుంటే..వయసూరుకొంటుందా కనుసైగ చేస్తువుంటే..వలపాపుకొంటుందా సరికొత్తా గుబులేదో..గుండెల్లో రేపేవు ఈ వింతే పులకింత కావాలీ..నీ చెంతే బ్రతుకంత సాగాలీ అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...... అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో....... పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి