7, ఆగస్టు 2021, శనివారం

Yemaaya Chesave : Manasaa Malli Malli Song Lyrics (మనసా మళ్ళి మళ్ళి చూశా)

చిత్రం: ఏ మాయ చేసావే (2010)

సంగీతం:ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: చిన్మయి, దేవం ఏకాంబరం 



ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో.. అఖరికి వాళ్ళనే ఒ చోట కలిపేస్తాడు.. మనసా మళ్ళి మళ్ళి చూశా ..గిల్లి గిల్లి చూశా .. జరిగింది నమ్మేశా జతగా నాతో నిన్నే చూశా .. నీతో నన్నే చూశా .. నను నీకు వదిలేశా పై లోకంలోవాడు ఎపుడో ముడి వేసాడు.. విడిపోదే విడిపోదే… తను వాన విల్లంట..నువు వాన జల్లంట.. మనలోన ఈ ప్రేమ కిరణం కిరణం తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా.. విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం…. మనసా మళ్ళి మళ్ళి చూశా .. తోడల్లే చూశా నీ వెంట అడుగేశా తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో హాయి మల్లె తీగలతో, వేచి వున్న వాకిళ్ళు నింగి,నేల,గాలి,నీరు,నిప్పు అన్నీ.. అవిగో స్వాగతం అన్నాయి.. తను వాన విల్లంట..నువు వాన జల్లంట.. మనలోన ఈ ప్రేమ కిరణం కిరణం తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా.. విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం…. మనసా మళ్ళి మళ్ళి చూశా ..నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశ.. జతగా నాతో నిన్నే చూశా నా తోడల్లే చూశా .. నీ వెంట అడుగేశా .. పై లోకంలోవాడు ఎపుడో ముడి వేశాడు.. విడిపోదే విడిపోదే… తను వాన విల్లంట..నువు వాన జల్లంట.. మన లోన ఈ ప్రేమ కిరణం కిరణం తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా.. విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం…. ఒ…. ప్రేమ జ్వరం ఒ.. విడుచు క్షణం ఒ.. పెళ్ళి అనుకుంటే ఒ… కలియుగమే విడిచేది మరణంతోనే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి