2, నవంబర్ 2021, మంగళవారం

Bhale Bullodu : Muddu Mudduga Song Lyrics (ముద్దు ముద్దుగా ముత్యాల వానజల్లు )

చిత్రం: భలే బుల్లోడు (1995)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



పల్లవి:-

ముద్దు ముద్దుగా ముత్యాల వానజల్లు కురవనీ మెత్త మెత్తగా వయ్యారమంతా తడిమి చూడనీ కనుచూపులే కొంటె మెరుపులై కవ్వింతలే కన్నె ఉరుములై కలిపింది వాన కౌగిళ్లలో ముద్దు ముద్దుగా ముత్యాల వానజల్లు కురవనీ మెత్త మెత్తగా వయ్యారమంతా తడిమి చూడనీ.

చరణం1:

కొత్త కొత్త కోరిక కొంగే దాటు వేళలో వెన్న పూసలాంటి వల్లు నిన్నే కోరుతున్నది వెచ్చనైన ఊహలో ఒళ్లే తూలే హాయిలో రెచ్చిపోయి కోడె ఈడు నిన్నే తరుముతున్నది కట్టాలి జట్టు పట్టాలి పట్టు కమ్మంగా వాన జోరులో పట్టాను గుట్టు ఉయ్యాల కట్టు అందాల పూల దీవిలో మెరుపే మైమరుపై నీ ఒడిలో దాగేవేళా హయ్.. ముద్దు ముద్దుగా ముత్యాల వానజల్లు కురవనీ ఆ. మెత్త మెత్తగా వయ్యారమంతా తడిమి చూడనీ.

చరణం2:

ఆగమంటే ఆగదు ఆశే నన్నే వీడదు చిన్నదాన్ని చీర బెంగ తీర్చేదాక వదలదు తాల లేడు తుంటరి మాటే వినడు పోకిరి తెల్లవారి పోయేదాకా ఆపేదెట్టా అల్లరి చిక్కావే బొమ్మ దానిమ్మ రెమ్మ చిత్రాలు చేసే వానలో ఆడించకమ్మా అంతింతా కొమ్మ మత్తెక్కి పోయే మలుపులో వయసే వెల్లువగా కమ్ముకునే కోలాటంలో

హా.. ముద్దు ముద్దుగా ముత్యాల వానజల్లు కురవనీ హోయ్ మెత్త మెత్తగా వయ్యారమంతా తడిమి చూడనీ కనుచూపులే కొంటె మెరుపులై.. కవ్వింతలే కన్నె ఉరుములై..... కలిపింది వాన కౌగిళ్లలో......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి