13, నవంబర్ 2021, శనివారం

Gamyam : Enthavaraku Song Lyrics (ఎంతవరకు ఎందుకొరకు )

చిత్రం: గమ్యం (2008)

రచన:  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రంజిత్

సంగీతం: ఈ.ఎస్. మూర్తి, అనిల్.ఆర్


పల్లవి :  

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

చరణం 1 :

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరేం ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషీ అంటే ఎవరూ సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

చరణం 2 :

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం పుటక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి

తారరరరే తారరరరే తారరరరే తారారరే తారరరరే తారరరరే తారరేరా రారరరరే తారరరరే తారరరరే తారరేరా రారరరరే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి