18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

CID (1965) : Nasari Neevani Song Lyrics (నా సరినీవని నీ గురినేనని)

చిత్రం: సి.ఐ.డి (1965)



పల్లవి :  నా సరినీవని నీ గురినేనని... ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలది... పులకలు కలిగెనులే నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎఫుడో తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలది... కలవరమాయెనులే నా సరి నీవని... నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే  చరణం 1 :  నా హృదయమునే వీణ చేసుకొని.. ప్రేమను గానం చేతువని.. ఆ.................... ఆ................ఆ.............. నా హృదయమునే వీణ చేసుకొని... ప్రేమను గానం చేతువని నీ గానము నా చెవి సోకగనే.. నా మది నీదై పోవునని నీ గానము నా చెవి సోకగనే .. నా మది నీదై పోవునని... నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎపుడో తెలిసెనులే చరణం 2 : నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని ఏమాత్రము నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని ఏమాత్రం నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని నా సరినీవని.. నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచిన కొలది... కలవారమాయెనులే నా సరి నీవని... నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి