14, ఫిబ్రవరి 2022, సోమవారం

Manchi Manasuku Manchi Rojulu : Dharaniki giri bharama Song Lyrics(ధరణికి గిరి భారమా)

చిత్రం: మంచిమనసుకు మంచిరోజులు (1958)

సంగీతం: ఘంటసాల గీతరచయిత: సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూనియర్) నేపధ్య గానం : రావు బాలసరస్వతి దేవి


ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా? తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా? మును నే నోచినా నా నోము పండగా నా ఒడిలో వెలిగే నా చిన్ని నాయనా పూయని తీవెననే అపవాదు రానీక తల్లిననే దీవెనతో తనియించినావయ్య

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా? తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా? ఆపద వేళల అమ్మ మనసు చెదరునా? పాపల రోదనకే ఆ తల్లి విసుగునా? పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధి?

పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధి? ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా? తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి