చిత్రం: చిన్ని కృష్ణుడు (1988)
సాహిత్యం : వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఆశా భోస్లే
సంగీతం: ఆర్.డి.బర్మన్
జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా ఏది భువనం ఏది గగనం తారా తోరణం ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం చేతనాత్మక శిల్పం మతి కృతి పల్లవించే చోట మతి కృతి పల్లవించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ, ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ సృష్టికే ఇది అందం దృష్టికందని దృశ్యం కవులు రాయని కావ్యం కృషి ఖుషి సంగమించే చోట కృషి ఖుషి సంగమించే చోట జీవితం సప్త సాగర గీతమ్ వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా మీ స్నేహగీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి