చిత్రం: దత్త పుత్రుడు (1972)
రచన: సి నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల
సంగీతం: టీ చలపతి రావు
గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాయ్ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం 1: తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి.. ఆహా.. తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి అదను చూసి నా చేయి పట్టుకుంటివి ఆనాటి నుంచి నా మదిలో.. అల్లరి పెడుతుంటివి గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా ఆఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం 2: నీ కందీరగ నడుమేమో కదులుతున్నది దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది నీ కందీరగ నడుమేమో కదులుతున్నది దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది నీ ఉంగారాల జుట్టేమో ఊగుతున్నది దాన్ని ఒక్కసారి నిమరాలని ఉబలాటం ఉన్నది హోయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం 3: పైర గాలి నా చెవిలో ఊగుతూ ఉన్నది పైర గాలి నా చెవిలో ఊగుతున్నది నీ పడుచుదనం రుచి ఎంతో చూడమన్నది లగ్గమాడే రోజు దగ్గెరున్నది మనం లగ్గమాడే రోజు దగ్గెరున్నదీ... ఈ ఈ ఈ ... అందాకా ఈ తొందర ఎందుకులే అన్నది హాయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా.. హా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి