చిత్రం: జీవన తరంగాలు (1973)
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల
సంగీతం: జె. వి. రాఘవులు
పుట్టినరోజు పండగే అందరికి..... మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి, ఎందరికి.........
పుట్టినరోజు పండగే అందరికి..... మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి, ఎందరికి......... కలిమికేమి వలచినంత వున్న....... మనసు చెలిమికొఱకు చేయి చాపుతుంది. అమనసే ఎంత పేద దైన....... అనురాగపు సిరులు పంచుతుంది... మమత కొరకు తపియించే జీవనం.../2/ దైవమందిరంలా పరమ పావనం..... పుట్టినరోజు పండగే అందరికి...... పువ్వెందు తీగపై పుడుతుంది..... జడలోను, గుడిలోను నిలవాలని... ముత్యమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారం లో మెరవాలని... ప్రతిమనిషి తనజన్మకు పరమార్టం తెలుసుకొని.. ప్రతిమనిషి తనజన్మకు పరమార్థం తెలుసుకొని... తనకోసమే కాదు పరులకొరకు బ్రతకాలి తానున్న లేకున్నా.......... తానున్న లేకున్నా, తన పేరు మిగలాలి.. పుట్టినరోజు పండుగే అందరికి.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి