22, మార్చి 2022, మంగళవారం

Manavudu Danavudu : Anuvu Anuvuna Velasina Deva Song Lyrics (అణువు అణువున)

చిత్రం: మానవుడు దానవుడు (1972)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

సంగీతం: అశ్వథామ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించరావా అణువును అణువున వెలసిన దేవా చరణం 1: మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పుని మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమరజీవులై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఆ.....ఆ.....ఆ.....ఆ....ఆ... అమరజీవులై వెలిగిన మూర్తుల అమృతగుణం మాకందించ రావా అమృతగుణం మాకందించ రావా అణువును అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించ రావా అణువును అణువున వెలసిన దేవా చరణం 2: జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృ భూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ...ఆ...ఆ... ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ... ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మా కందించ రావా త్యాగ నిరతి మా కందించ రావా అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై నడిపించ రావా అణువు అణువున వెలసిన దేవా చరణం 3: వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు చాచే వేళ గుండెకు బదులుగ గుండెను పొదిగీ కొన ఊపిరులకు ఊపిరిలూదీ జీవన దాతలై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఆ....ఆ....ఆ....ఆ....ఆ.....ఆ... జీవన దాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించ రావా సేవా గుణం మాకందించ రావా అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి