చిత్రం: శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర(1984)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గానం: వి. రామకృష్ణ
శివ గోవింద గోవింద హరిహి ఓం హరి గోవింద గోవింద నా వాక్ ప్రభావమ్ము జ్ఞాన ప్రభోధమై కాల గతిని ఎరుక చేసెను శివ గోవింద గోవింద కలియుగమ్మున ఐదు వేలేండ్ల పిమ్మట మనధర్మమే మారిపోయేను కుల వివక్షత కూలిపోయేను మానవులలో నీతి మటుమాయంయ్యేను అన్యాయమే రాజ్యమేలేను శివ గోవింద గోవింద బ్రహ్మ వంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తిధర్మం వదలి పెట్టేరు బ్రష్టులై చెడుదార్లు పట్టేరు అగ్రహారమ్ములు మనిమాన్యములూపోయి ఉట్టి చెంబులు చేతపట్టేరు శివ గోవింద గోవింద రాజులందరూ కూడా భోగాలలో మునిగి రాజ్యమూడిత రాజులవుతారు ప్రజలకు దండాలు పెడతారు రాజ్యభవనాలన్ని భోజనాలయములై భరణాలతో వారు బ్రతికేరు శివ గోవింద గోవింద వర్తక వ్యాపారములు వీడి వైశ్యులు నిజమన్నదాన్ని వదిలేసేరు తలకు మాసిన పనులు చేసేరు సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు శివ గోవింద గోవింద కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టకా... చట్టాల సందున నలిగేరు పాలు నెయ్యి అమ్మి బ్రతికేరూ భూమిపుట్టా ఊడి పొట్ట చేత పట్టి పట్టణాలకు వలస పోయేరు శివ గోవింద గోవింద వ్యాపారమనుపేరా తెల్లదొరలూ వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు ప్రభువులై నెత్తి పైకేక్కేరు ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో రేపి మన మతానికే ఎసరు పెడతారు శివ గోవింద గోవింద ఉత్తరదేశాన వైశ్యకులము నందు గాంధి అనువాడొకడు పుడతాడు ఉత్తరదేశాన వైశ్యకులము నందు గాంధి అనువాడొకడు పుడతాడు స్వాతంత్ర సమరమ్ము చేస్తాడు రేకు ఫలము తోటి మేకవుతూ చివరకు తెల్లవాళ్ళను వెళ్ళగొడతాడు శివ గోవింద గోవింద ముండమోపూలంత ఏలికలు అయ్యేరు మాలమాదిగా మంత్రులోచ్చేరు విడ్డూరములు చాల జరిగేవు వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేటి వీరులు మున్ముందు పుడతారు శివ గోవింద గోవింద
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి