చిత్రం: శ్రీ తిరుపతమ్మ కథ (1963)
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: పామర్తి, బి. శంకర్
పువ్వై విరిసిన పున్నమి వేళా.. బిడియము ..నీకేలా ...బేలా పువ్వై విరిసిన పున్నమి వేళా..బిడియము ..నీకేలా ...బేలా పువ్వై విరిసిన పున్నమి వేళా.. చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే చల్లని గాలులు సందడి చేసే... తొలి తొలి వలపులు తొందర చేసే జలతారంచుల మేలి ముసుగులో తలను వాల్తువేలా...బేలా పువ్వై విరిసిన పున్నమివేళా బిడియము ..నీకేలా ...బేలా పువ్వై విరిసిన పున్నమి వేళా.. మొదట ముంగినవి మొలక నవ్వులూ పిదప సాగినవి బెదరు చూపులూ ఆ...ఆఆ ...హా ...ఆ ఆ ఆ ..ఆ ఆ .అఅ అ అ ...అ అ అఆ మొదట ముంగినవి మొలక నవ్వులూ పిదప సాగినవి బెదరు చూపులూ తెలిసేనులే నీ ..తలపులేమి టో తొలగి పోదువేలా....బేలా పువ్వై విరిసిన పున్నమి వేళా.. బిడియము ..నీకేలా ...బేలా పువ్వై విరిసిన పున్నమి వేళా.. తీయని వలపుల పాయసమా...ని మాయని మమతల ఊయల లూగీ తీయని వలపుల పాయసమా...ని మాయని మమతల ఊయల లూగీ ఇరువురమొకటై పరవశించగా ఇంకా ...జాగే...లా ...బేలా పువ్వై విరిసిన పున్నమి వేళా.. బిడియము ..నీకేలా ...బేలా పువ్వై విరిసిన పున్నమి వేళా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి