22, మార్చి 2022, మంగళవారం

Thobuttuvulu : Madhuramaina Reyilo Song Lyrics (మధురమైన రేయిలో)

చిత్రం: తోబుట్టువులు (1963)

సాహిత్యం: అనిసెట్టి 

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: సి.మోహన్ దాస్

పల్లవి :

మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥

మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥

చరణం : 1

తళుకు తళుకు తారలే అద్దాల నీట ఊగెలే కలల రాణి జాబిలి నా కన్నులందు దాగెలే పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥

మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥

చరణం : 2

చిలిపి చిలిపి నవ్వులే చిందించెనేల పువ్వులే (2) ఆశమీర హృదయమే ఆనంద నాట్యమాడెలే పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥

మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి