చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం: జె.వి.రాఘవులు రచన: వేటూరి. సుందర రామ మూర్తి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
వీణ నాది తీగ నీది తీగ చాటు రాగ ముంది
పువ్వు నాది పూత నీది ఆకుచాటు అందముంది
తొలిపొద్దు ముద్దాడగానే ఎరుపెక్కె తూరుపు దిక్కు
తొలిచూపు రాపాడగానే వలపొక్కటే వయసు దిక్కు
వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి వయసల్లే కాటేస్తే చిక్కు
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు
మబ్బుల్లో మెరుపల్లే కాదూ వలపు వాన కురిసీ వెలిసి పోదూ
మనసంటే మాటలు కాదూ అది మాట ఇస్తే మరచి పోదూ
బ్రతుకల్లే జతగూడి వలపల్లె వనగూడి వొడిలోనే గుడి కట్టే దిక్కు
నా గుడి దీపమై నాకు దక్కూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి