చిత్రం: త్రినేత్రుడు (1988)
సంగీతం: రాజ్-కోటి
రచన: వేటూరి. సుందర రామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా బిగిసిన రైకలో సొగసుల కేకలే ఎగసిన వేలలో ఎగబడగా...కలబడగా చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా నలిగి మెత్తగ అలిగే సొగసే మత్తుగ అత్తరు కొడుతుంటే చిదిపి సన్నగ కదిపి వలపే వంటికి వత్తిడి పెడుతుంటే నా రెక్క నీ పిక్క అంటించగా తైతక్క లాటెదో పుట్టించగా లోలోన పైపైన రెట్టింతగా లోతైన మోహాలు ముట్టించగా మబ్బుల చాటున జాబిలి చేజిక్కనీ ఊకిరి చూపుల చుక్కని కొండెక్కనీ మబ్బుల చాటున జాబిలి చేజిక్కనీ ఊకిరి చూపుల చుక్కని కొండెక్కనీ తొలిగా కలిసీ నడిపే కథలో రేగే శృంగారమే చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా అడిగి ముద్దుల కరిగే ఒడిలో ప్రేమకు ఉగ్గులు కడుతుంటే ఒదిగి కౌగిలి తొడిగే అమ్మడి ముంగిట ముగ్గులు పెడుతుంటే నా కన్ను నీ కన్ను కవ్వింతగా వెన్నెల్లు పగటేల పుట్టించగా నీ పోసు నా మోజు పూసంతగా చీకట్లో చిరు తిల్లు తినిపించగా పున్నమి నాటికి పువ్వులు తలకెక్కనీ పువ్వులు వాలిన తుమ్మెద మత్తెక్కనీ పున్నమి నాటికి పువ్వులు తలకెక్కనీ పువ్వులు వాలిన తుమ్మెద మత్తెక్కనీ తడిగా పొడిగా తగిలే తపనే తీరే సాయంత్రమే చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా బిగిసిన రైకలో సొగసుల కేకలే ఎగసిన వేలలో ఎగబడగా...కలబడగా చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి