9, మే 2022, సోమవారం

Bramha : Chindhey Chindey Siva linga Lyrics (అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ)

చిత్రం: బ్రహ్మ (1992)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: బప్పీలహరి



హే షిరిడి సాయి బాబా ఈ గొడవేందో చూడు బాబా ఈ సీసాలో బిరడాలకి ఆ శివుడి గరళానికి చిందుల పందేలు సాగేనయ్య అరెరరెరరెరరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా అరె పెగ్గుమీద పెగ్గే జారంగా ఆ తిక్క నెత్తినెక్కి ఆడంగా ఆ చుక్కల సింగారం చూడంగా... అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా హా హా మంచుకొండ మంచినీళ్లు కలిపీ మందు మింగినోడు శివుడు అరె ఎండిపోయే గుండెకాయ తడిపీ ఇట్టా బతికినోడే ఘనుడు హే తాగినోళ్లంతా దేవుళ్ళురా రేయ్ తాగలేనోడే మనిషంటరా రాత చేతకాని బ్రహ్మిగాడు ఈ బొమ్మల్నిజేస్తే ఆ బొమ్మలకు రంగులేసేవాడు పరబ్రహ్మ దేవుడైతే ఆ బ్రహ్మ తలదన్నే దేవుడ్నిరా ఆడి రాతనే మార్చే దాదానిరా హూ హా హా అందుకే అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా హు... బంగాళఖాతంలో బార్ ఓపెన్ జేసి పసిఫిక్ ఓషన్ని విస్కీగా మార్చేసి ఇండియా కంట్రికే ఇన్కమ్ తెద్దాము లేకుంటే ఈ దేశం అప్పుల్లో పడతాది కంట్రీ అప్పుకింద బ్యాంకుల్లో బంగారం అమ్ముకున్న రాకుమార్లు అందుకే మందు కొట్టేసి దేశానికి ఇన్కమ్ తెచ్చి పెడుతున్నాము సాగరాలు తాగేసి మేఘం ఆ సారాయి కాస్తే అరె వానజల్లు వరదలయ్యి పోయి మళ్ళి సారాయి వస్తే ఆ బ్రహ్మ సృష్టంతా మునగాలిరా ఈ బ్రహ్మ చెప్పిందే జరగాలిరా అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా అరె పెగ్గుమీద పెగ్గే జారంగా ఆ తిక్క నెత్తినెక్కి ఆడంగా ఆ చుక్కల సింగారం చూడంగా... హోయ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి