చిత్రం: లక్ష్మి నివాసం (1968)
రచన: ఆరుద్ర
గానం: ఘంటసాల
సంగీతం: కే .వి.మహదేవన్
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికి మూలం మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ..ధనమేరా అన్నిటికి మూలం.. ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే.. ధనమేరా అన్నిటికీ మూలం కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లొ ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి