చిత్రం : అమ్మ కొడుకు (1993)
కోవెల గంటలు ఏమన్నవి నా తొలి పూజలు నీ కన్నవి ప్రేమకు నీ పెదవే పల్లవి కన్నుల కాసిన జాబిల్లివి కోవెల గంటలు ఏమన్నవి నా తొలి పూజలు నీ కన్నవి చరణం: 1 మల్లె జాజుల్లో వాసనే మౌనము మత్తెకించే ఆ మౌనమే ప్రాణము మల్లె జాజుల్లో వాసనే మౌనము మత్తెకించే ఆ మౌనమే ప్రాణము పూలలో తేనెలు గాలికె ఆరవు నింగిలో తారలు వానకే రాలవు తొలకరి అనుభవం - ఆ...ఆఆ.. తొడిమకు పులకరం - ఓ..ఓఓ... తొలకరి అనుభవం తొడిమకు పులకరం తేనెపాలు చిలికిన వయసును కోవెల గంటలు ఏమన్నవి నా తొలి పూజలు నీ కన్నవి ప్రేమకు నీ పెదవే పల్లవి కన్నుల కాసిన జాబిల్లివి కోవెల గంటలు ఏమన్నవి నా తొలి పూజలు నీ కన్నవి చరణం: 2 వెన్నెల్లో వేడి కన్నులే మూయదు ఏదో ఆరాటం ఎంతకీ తీరదు వెన్నెల్లో వేడి కన్నులే మూయదు ఏదో ఆరాటం ఎంతకీ తీరదు గుండెలో వేసవి చూపుతో ఆరదు మనసులో ఆకలి మాటతో ఆగదు పెదవుల పరిచయం - ఆ..ఆఆ ఎదలకు పరిణయం - ఓ..ఓఓ పెదవుల పరిచయం ఎదలకు పరిణయం మాఘవేళ మలసిన వయసున కోవెల గంటలు ఏమన్నవి నా తొలి పూజలు నీ కన్నవి ప్రేమకు నీ పెదవే పల్లవి కన్నుల కాసిన జాబిల్లివి కోవెల గంటలు ఏమన్నవి నా తొలి పూజలు నీ కన్నవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి