చిత్రం: రంగమార్తాండ (2023)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: గాయత్రీ
సంగీతం: ఇళయ రాజా
నన్ను నన్నుగా
ఉండనీవుగా
ఎందుకంటూ నిందలేవీ వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా
లోలో ఏదో వెచ్చనైన వేడుక
చిచ్చో అన్నా చల్లబడదే
నిన్నూ అంతే ముచ్చటైన కోరిక
ముంచేస్తుంటే మంచిదన్నదే
దారీ దరీ లేని అశ
మనసు నను ఎన్నడో విదిచిపోయిందనీ
ఎగసి నీ గుండెలో వలస వాలిందని
తెలిసి తెలిసీ సై అన్నానో
తెలియదేమో అనుకున్నానో
తగని చొరవ కదా అని అన్నానో
తగిన తరుణమనుకున్నానో
తలపు నిన్నొదిలి
మరలి రాదే
దరిమిలా మనకిలా కలహమేల
కంటి ఎరుపేమిటో కొంటె కబురన్నది
ఒంటి మెరుపేమిటో కందిపోతున్నది
చిగురు పెదవులను
నీ పేరు చిదిమి
చిలిపి కాటేస్తుంటే
బిడియ పడకు అని నీ వేలు
అదును తెలిసి మీటుతూ ఉంటే
నన్ను నన్నుగా
ఉండనీవుగా
ఎందుకంటూ నిందలేవీ వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి