చిత్రం: అస్త్రం (2006)
సాహిత్యం: వేటూరి సుందర రామ మూర్తి
సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్
గానం: అనంతు, రాజేష్
పల్లవి: ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యదే పెట్టే సొదే ఓ ఆపదై వేధించగా అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా దిస్ ఈస్ మై లవ్ దిస్ ఈస్ మై లవ్ ఇదో కథలే ఇదో జతలే ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం చరణం:1 కలవరమొక వరమనుకో కలలను కంటూ ప్రతి నిమిషము నీదనుకో జతపడి ఉంటూ నింగి నేలకి స్నేహం ఎప్పుడైనది అప్పుడే కదా ప్రేమ చప్పుడైనది వలపే సోకని నాడు ఎడారే గుండె చూడు ముళ్ళని చూడకు నేడు గులాబి పూలకు దిస్ ఈస్ మై లవ్ దిస్ ఈస్ మై లవ్ ఇదే కథలే ఇలా మొదలే ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం చరణం:2 నిదురెరగని తనువులతో నిలువని పరుగు మధువుల తడి పెదవులతో పిలవని పిలుపు మండుటెండలా తాకే పండు వెన్నెల కొండ వాగులా మారే ఎండమావిలా కనులే మూయను నేను జపిస్తూ ప్రేమ రూపం కవితే రాయను నేను లిఖిస్తా నీ స్వరూపం దిస్ ఈస్ మై లవ్ దిస్ ఈస్ మై లవ్ ప్రతీ యదలో ఇదో కథలే ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం యదే పెట్టే సొదే ఓ ఆపదై వేధించగా అదే పొంగే సుధై ఏ దేవతో దీవించగా దిస్ ఈస్ మై లవ్ దిస్ ఈస్ మై లవ్ ఇదో కథలే ఇదో జతలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి