14, జనవరి 2024, ఆదివారం

Pilisthe Palukutha : Manasa Ottu Song Lyrics (మనసా ఒట్టు మాటాడొద్దు)

చిత్రం: పిలిస్తే పలుకుతా(2003)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



మనసా ఒట్టు మాటాడొద్దు పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు వెచ్చని ముద్దు వెతికా గుర్తు మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు అతనెంతగా ప్రేమ పంచినా ఆ ప్రేమయె వరాలిచ్చినా అవి పొందలేవని నీ మూగబాధని కరిగించనివ్వవే కంచల హద్దు మనసా ఒట్టు మాటాడొద్దు పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు వెచ్చని ముద్దు వెతికా గుర్తు మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు అతనెంతగా ప్రేమ పంచినా ఆ ప్రేమయె వరాలిచ్చినా అవి పొందలేవని నీ మూగబాధని కరిగించనివ్వవే కంచల హద్దు నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను నూరేళ్ల తీపి స్వప్నంలా బతుకుతూనె ఉంటానూ పడమటింటి పడక మీద మల్లె పూలు వేసీ ప్రతి సంధ్యలోన ఎదురు చూస్తు ఉంటానూ ఎలా చెప్పను ఎలా చెప్పను మూడు నాళ్ల నిజం నేనని ఈ తీయని జ్ఞాపకాలని మరు జన్మకె పంచి ఇవ్వనీ ఆ రోజు కోసమే ప్రతి రోజు గడపని క్షమించు నేస్తమా వద్దన వద్దు మనసా ఒట్టు మాటాడొద్దు పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు వెంటాడకమ్మ ఎడారి ఎండమావినీ తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మనీ కొలువుండకమ్మ సమాధి నీడ చాటునీ చితి మంట చూసి కోవెలలలో యజ్ఞవాటి అనుకొని మంటలారనీ గుండె జ్వాలనీ వెంట తరమకూ జంటకమ్మనీ ఏ భాషలో నీకు చెప్పినా ఏ భావమూ మూగబోయినా నువ్వు పట్టువదలని విక్రమార్కుడై నీ ప్రేమతొ నన్నే చంపేయొద్దు మనసా ఒట్టు మాటాడొద్దు పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు వెచ్చని ముద్దు వెతికా గుర్తు మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి