చిత్రం: ఖైదీ కాళిదాసు (1977)
రచన: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
ఓ.. హొ.. ఓఓఓ.. హొ.. ఓఓ.. హొ.. హా ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ ఆఆ.. ఆ..ఆ ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ
చరణం 1:
కదలిక వుందీ.. మబ్బులో కదలిక వుందీ.. నీటికీ వేగం వుందీ.. గాలికీ చలనం వుందీ.. వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ! కదలిక వుందీ మబ్బులో కదలిక వుందీ నీటికీ వేగం వుందీ గాలికీ చలనం వుందీ వీడిలోనే ఉలుకూ పలుకూ లేకుందీ! వయసొచ్చిందీ.. దానితో వలపొచ్చిందీ.. హా.. ఆ.. ఆ.. వయసొచ్చిందీ.. దానితో వలపొచ్చిందీ అందుకే చిన్నది తొందర పడుతోందీ.. అందుకే చిన్నది తొందర పడుతోందీ!! ఆఆ..ఆఆ.. అ ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ
చరణం 2:
కన్నేసిందీ.. కళ్ళతో కట్టేసిందీ.. చూపుతో చంపేస్తుందీ.. నవ్వుతో బ్రతికిస్తుందీ అమ్మమ్మో.. కుర్రది చాలా టక్కరిది! కన్నేసిందీ కళ్ళతో కట్టేసిందీ చూపుతో చంపేస్తుందీ నవ్వుతో బ్రతికిస్తుందీ అమ్మమ్మో..కుర్రది చాలా టక్కరిది! వీడితో ఔననిపించి.. కొంగుముడి వెయ్యకపోతే వీడితో ఔననిపించి.. కొంగుముడి వెయ్యకపోతే ఎందుకీ ఆడజన్మ వోయమ్మా.. ఎందుకీ ఆడజన్మ వోయమ్మా.. ఆఆ..ఆఆ.. ఆఆ ఎవరీ చక్కనివాడు.. ఎంతకూ చిక్కనివాడు.. ఎప్పటికి దారికొస్తాడో.. ఎవరీ చక్కని చుక్క.. సోకు దీని కాలికి మొక్క.. కాదన్నా వెంట పడుతోందీ.. హా.. ఆ.. ఆ.. కాదన్నా వెంటపడుతోందీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి