7, ఏప్రిల్ 2024, ఆదివారం

Selayeru Paduthunte Folk Song Lyrics (సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల)

సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల... (2022)

రచన: మహేందర్ ముల్కల

గానం: డి జె శివ వంగూర్, శ్రీనిధి

సంగీతం: కళ్యాణ్ కీస్



పల్లవి:

సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగుళ్ళుగుతుండే లోలోన నదులన్ని కలిసినట్టు ఓ పిలగా నవ్వేంతో బాగున్నదే నీ లోన గాజుల సప్పుడు గళ్ళుగళ్ళు మొగంగా గజ్జేల పట్టిలు గంతేసి అడంగ వరీగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముపవే ఈ వేల సిగ్గుసింగరాలు సిలుకుతున్నట్టుగా ముద్దమందారాలు పలుకుతున్నట్టుగా మాయమాటలు వాలకకు ఓ పిలగా మా అన్నాలోస్తున్నారు తోవ్వాళ్ళ సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగుళ్ళుగుతుండే లోలోన చరణం:1

పచ్చజొన్నలకంకులు ఓ పిల్ల పాలొచ్చిపోంగినాయి సెనంత రామసిలకలసూపులు చలింకా రత్నలాబొమ్మానైతి మాయింట పచ్చజొన్నలకంకులు ఓ పిల్ల పాలొచ్చిపోంగినాయి సెనంత రామసిలకలసూపులు చలింకా రత్నలాబొమ్మానైతి మాయింట పేయంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాలకాంతుల్లో దారిచేరునావైపు జోడేడ్ల బండికట్టి ఓ పిల్ల జోరుగాయేక్కిస్తానే ఈ వేళ ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన పూసింది మందర సిరిమల్లి మరుగుమాటల వాడివే ఓ బావ మా వాదినేలోస్తున్నారు తోవ్వాళ్ళ చరణం:2

బాయిగడ్డనఊసినాయి ఓ పిల్ల బంగారుకుసుమపూలు నిండుగా పూసినపున్నామోలే నేనున్నా బంగారు బమలెందుకోయ్ నాకింకా బాయిగడ్డనఊసినాయి ఓ పిల్ల బంగారుకుసుమపూలు నిండుగా పూసినపున్నామోలే నేనున్నా బంగారు బమలెందుకోయ్ నాకింకా కరండపడివిలో కస్తూరి రంగయే వెండికొండలమీద వెలుగన్నాలేదాయే నెమలికన్నులదానివే ఓ పిల్ల నెలవంకతిరున్నవే ఈ వేళ నల్లకాలువాలమీద నాటు తుమ్మెదవోలె అడవిమల్లెలమీద ఆ చంద్రవంకోలే కొంటెచూపులవాడివే ఓ బావ కోడళ్ళు వస్తున్నారే తోవ్వాళ్ళ చరణం:3

పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్ల పొద్ధంతా నినుచూస్తానే తోవ్వాళ్ళ సింగిడి రంగులల్ల పూసేటి సిరి జొన్న కంకినైతి తోటల్ల పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్ల పొద్ధంతా నినుచూస్తానే తోవ్వాళ్ళ సింగిడి రంగులల్ల పూసేటి సిరి జొన్న కంకినైతి తోటల్ల చినుకమ్మా,మెరుపమ్మ చినబోయినట్టుంది చలిమంట,గిలిమంట ఎదలోన రగిలింది చిలుక,గోరింకా వోలె కూడుండి చితిమీద తోడొస్తానే ఓ పిల్ల పాలమూత్యాలన్నీ పరవాలు ఓలుకంగా పండువెన్నెలవచ్చి పందిల్లు వేయంగా మొగలి పువ్వులవాడివే ఓ బావ మనువాడి కలిసుంటానే నీ తోడ మొగలి పువ్వులవాడివే ఓ బావ మనువాడి కలిసుంటానే నీ తోడ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి