చిత్రం: జనక అయితే గనక (2024)
రచన: కృష్ణకాంత్
గానం: ఆదిత్య ఆర్.కె
సంగీతం: విజయ్ బుల్గానిన్
పల్లవి:
నేనేదిఅన్న బాగుంది కన్నా
అంటూనే ముద్దడుతువే నీవే…
నా పక్కనుంటే చాలే…
కష్టాలు ఉన్న కాసేపు అయినా
రాజాలా పోజు కొడతానే నీవే…
నా పక్కనుంటే చాలే…
కలతలు కనబడవేనువ్వు ఎదురుగా నిలబడితే
గొడవలు జరగావులే
ఒడుదుడుకులు కలగావులే
అరక్షణమైన అసలెప్పుడైనాకోపం
నీలోనాఎప్పుడైనా చూశానా…..
పుణ్యమేదో చేసి ఉంటానే
నేడు నేను నిన్ను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్లామేఓ…ఆ …
చరణం: ఉదయం నే లేచే ఉన్నవేచుంటనే
నువ్వే ముద్దిచ్చేదాకామంచం దిగానే
హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్న కదా మాఫీ
మన గదులిది ఇరుకులు కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు గానీఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట
సరి గమ పద నిస పాట
గుండె కూడా చిందులేసేనంటచూడే ఈ పూటఆ…ఓ…
పుణ్యమేదో చేసి ఉంటానే
నేడు నేను నిన్ను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్టు నా పెళ్లామేఓ…ఆ …
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి