చిత్రం : రాహు (2020)
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
గీతరచయిత : శ్రీనివాస మౌళి
నేపధ్య గానం : సిద్ శ్రీరామ్
పల్లవి:
ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీ తోటి నే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో వున్నట్టుగా ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు నీ చూపు ఆకట్టగా నా లోకి జారింది ఓ తేనె బొట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమే ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో
చరణం-1: నేనేనా ఈ వేళ నేనేనా నా లోకి కళ్ళారా చూస్తున్నా ఉండుండి ఏ మాటో అన్నాననీ సందేహం నువ్వేదో విన్నావని వినట్టు వున్నావా బాగుందనీ తేలే దారేదని ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో
చరణం-2:
ఏమైనా బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోన ఈ చోటే కాలాన్ని ఆపాలనీ నీ తోటి సమయాన్ని గడపాలనీ నా జన్మే కోరింది నీ తోడునీ గుండె నీదేననీ ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో... ఏమో... ఏమో చెప్పలేని మాయే ప్రేమో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి