28, డిసెంబర్ 2024, శనివారం

Bathukamma: batukamma batukamma song lyrics (బతుకమ్మ బతుకమ్మ )

చిత్రం: బతుకమ్మ (2008)

రచన: గోరటి వెంకన్న

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: టి.ప్రభాకర్



పల్లవి :

బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ

తంగెల్లో దొరికిన తల్లీ.. మా తల్లీ బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను.. మా తల్లీ బతుకమ్మ నింగి నెలవంక వోలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ
చరణం 1 :
స్వామి కోనేటి నీరే నీ తానానికి పన్నీరే వీసే సిరు గాలి గంధం నీ మోముకు దిద్దే నందం నిను చూసి పత్తి మురిసే నీకోసం పొత్తిలి పరిసే సిలకమ్మా జోల పాడే సిన్నారి నిద్దురపోయే వాలుగొమ్మల ఉయ్యాల ఊగాలి నువు జంపాలా నీ బోసినవ్వులతోనే మా ఆశలు వికశించాలా నీ పాదం మోపిన నేల సిగురించి సిందెయ్యాల బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ

చరణం 2 :
సేమంతి పూసినట్టు సెలయేరు నవ్వినట్టు పొదనుండి దూకీ జింక పొద్దు వైపురికినట్టు వడివడినీ అడుగుల ఎంట ఊరంతా నడిసేనంట ఊటా బావి మోట నీ పాటకు దరువుల మోత ఊగేటి సొద్దా సేను నీ మాటకు తలలూపంట అలమంద ఆవు ధూళి నీ పాదాలకు పారాణి మా ఆశల ప్రతిరుపానివి బతుకమ్మా నువు మారాణి బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ తంగెల్లో దొరికిన తల్లీ.. మా తల్లీ బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను.. మా తల్లీ బతుకమ్మ నింగి నెలవంక వోలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ మా తల్లీ బతుకమ్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి