చిత్రం: కార్తికేయ (2014)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: హరి చరణ్
సంగీతం: శేఖర్ చంద్ర
పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ నిజమును ముసిరిన నివురది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి నిదురను చెరిపిన కలవరమేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి వెలుగుకు వెనుకన వివరము ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి వేలుకు కొలువున విలయమదేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి పలు ప్రశ్నలకొక బదులది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి తలపును తొలిచెను తరగని చీకటి చీకటి చీకటి నరుడా గురుడా ఎవరా మూలము కాలుని పాశమై కదిలెను కాలము జరిగెటిదిదియే దైవ మహత్యము కానిచొ ఇదియే మానవ యత్నము తెలియునదెప్పుడీ మాయ రహస్యము తెలియుట మాత్రమ-వశ్యమ-వశ్యము బ్రతుకొక తపముగా పరుగిడు పయనము తలవని మలుపుగ కనుగొను విజయము ఆఆఆఆఆఅ.... ఆఆఆఆఅఆ... పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి