27, జనవరి 2025, సోమవారం

Agent Gopi : Chitapata Chinukulu Song Lyrics (చిటపట చినుకులు.. )

చిత్రం: ఏజెంట్ గోపి (1978)

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

సంగీతం: సత్యం


పల్లవి :

చిటపట చినుకులు.. మన కోసం కురిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి
ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి...
చిటపట చినుకులు.. మనకోసం కురిశాయి 

చరణం 1 :

ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది

ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది 
హా.. వెచ్చని కౌగిలి పైటగా చేసుకో..
గాలిని వానని జంటగా గెలుచుకో...
చిటపట చినుకులు.. మనకోసం కురిశాయి 

చరణం 2 :

నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు

నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు 
అంతగా చూడకు సిగ్గులో ముంచకు
అందుకో వలపులు.. పంచుకో తలపులు..
ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి...
చిటపట చినుకులు.. మనకోసం కురిశాయి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి