చిత్రం: ఆకలి రాజ్యం (1981)
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
పల్లవి:
ఓ మహాత్మా... ఓ మహర్షి
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం ఏది పాపం
ఏది నరకం ఏది నాకం
ఏది సత్యం ఏదసత్యం
ఏదనిత్యం ఏది నిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణమేది కార్యం
ఓ మహాత్మా.. ఓ మహర్షి
చరణం 1:
ఏది తెలుపు ఏది నలుపు
ఏది గానం ఏది మౌనం
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
నేటి ఖేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షి ఓ మహాత్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి