26, జనవరి 2025, ఆదివారం

America Abbayi : Edesamegina Endukalidina Song Lyrics (ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...)

చిత్రం: అమెరికా అబ్బాయి (1987)

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు



పల్లవి:

ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
రాయప్రోలన్నాడు ఆనాడూ...
అది మరిచిపోవద్దు ఏనాడూ

చరణం 1:

పుట్టింది నీ మట్టిలో సీత....
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా...
వేదాల వెలసినా ధరణిరా...
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

చరణం 2:

వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?
గాలికీ నీటికీ లేవు భేధాలూ...
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలూ
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా...
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...

చరణం 3:

గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి