చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీత రచయిత : ఆరుద్ర
గానం : రామకృష్ణ, పి. సుశీల
పల్లవి :
అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన.. గుబులౌతుందే
అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన గుబులౌతుందే
అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
చరణం 1 :
ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఉలికులికి పడేదానివే . . నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే
అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో . . ఊ
అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో
నెత్తి మీద మొట్టేదానినోయ్... నువ్వు మొట్టగానే సాచిపెట్టి కొట్టేవడినే
అబ్బోసి చిన్నమ్మా... ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
చరణం 2 :
మలిసంజవేళలో మర్రిచెట్టు నీడలో...
మలిసంజవేళలో మర్రిచెట్టు నీడలో
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది..
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది
పిడుగుపడితె హడలిపోయావే.. నన్నతుక్కుని అదుకుమున్నావే
పిడుగుపడితె హడలిపోయావే.. నన్నతుక్కుని అదుకుమున్నావే
అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అదుముకుంటే విదిలించుకు . . పరుగుపుచ్చుకున్నావు
నాటినుండి నేటి దాక ఫికరులేకపోయావు
వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా
వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా
అబ్బోసి... చిన్నయ్య . . అబ్బోసి... చిన్నమ్మ . .
అబ్బోసి... చిన్నయ్య . . అబ్బోసి... చిన్నమ్మ . .
అబ్బో. . అబ్బో . . అబ్బో . . అబ్బో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి