17, జనవరి 2025, శుక్రవారం

Andamaina Anubhavam : Singapore Singari Song Lyrics (సింగపూరు సింగారి)

చిత్రం. : అందమైన అనుభవం (1979)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ


పల్లవి:
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ..
అహ సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ..
రాజమండ్రి కోడలుగ రానుంది అహహహ
మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ
రాజమండ్రి కోడలుగ రానుందీ ఎహేహేహే హహహ

చరణం 1:

దొరికింది గుర్రపు నాడం దొరుకుతుందనుకుంటి గుర్రం
ఊరంత గాలించినాను గాడిదై పోయాను నేను
నే నలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోతే మెరుపల్లే వచ్చావు శంభో..
నా నిదురపోయి అదిరిపోయి మూగపోయి ఆగిపోతే గిలిగింత పెట్టావు శంభో..
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ
రాజమండ్రి కోడలుగ రానుందీ... పపపప..

చరణం 2:

నీ కళ్ళు నా కళ్ళు కలిసి.. నీ కోర్కె నా కోర్కె తెలిసి
నీ సొగసు పువ్వల్లే విరిసి.. నా వయసు గువ్వల్లే ఎగసి
నేనదును చూసి తెగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటె మంచల్లే కరిగావే శంభో
నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహమేసి అల్లాడిపోతున్న శంభో
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ
రాజమండ్రి కోడలుగ రానుందీ.. పపపప...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి